పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం పిడింగొయ్యి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష అరవై వేల మందికి అందిస్తున్నామని, అలాగే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలం, కడియం మండలం, వార్డులు కలిపి దాదాపు 500 పైచిలుకు అర్హులైన వారికి అందిస్తున్నామని అన్నారు.మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు.
ప్రతి పేదవాడికి న్యాయం చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ఈ నెలలోనే తల్లికి వందనం, రైతు నేస్తం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలో 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు అందిస్తున్నామని, రాష్ట్రమంతటా సమగ్ర సర్వే జరుగుతుందని, సర్వే అనంతరం అర్హులైన సుమారు నాలుగు లక్షల మందికి కొత్త పెన్షన్లు అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్స్సేటి ప్రసాద్, ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మట్ట శ్రీను, ప్రత్యేక అధికారి జ్యోతి, ఎం.పీ.డీ.వో డి.శ్రీనివాసరావు, బొప్పన నాగేశ్వరరావు, బొప్పన శ్రీను, కోరాడ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సూరిబాబు, కందిరెల్లి సత్తిబాబు, మరుకుర్తి వెంకటేశ్వరరావు, ముప్పిడి రాంబాబు, మార్ని దొరబ్బాయి, వల్లెపల్లి ప్రసాద్ చౌదరీ (బాబుఖాన్) ,ఎడ్ల రామకృష్ణ, కాప శ్రీను, గెడ్డం ప్రభుదాస్,దేవరలంక మంగాయమ్మ, కేదారి, మట్ట నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


