జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 19.40.08

TRINETHRAM NEWS

గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు

దుళ్ళ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వాటర్ ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల…

Trinethram News : కడియం: గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని ప్రజలకు ఉపయోగపడే పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం కడియం మండలం దుళ్ళ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ ప్రాంతాన్ని ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలందరికీ మంచినీటి సమస్య తీర్చే విధంగా 59 లక్షల రూపాయల అంచనాలతో ప్రారంభించిన వాటర్ ట్యాంక్ పనులు కొంతమంది స్థానిక స్వార్థపరులు సదరు ట్యాంకు నిర్మాణం జరుగుతున్న స్థలంపై కోర్టుకి వెళ్లడం వలన ఆగిపోయిందని, ఇప్పటికే గ్రామంలో రెండు కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు చేసి 240 ఇళ్లకు టాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

సదరు స్థల వివాద విషయమై సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వివరణ కోరగా ట్యాంకు నిర్మాణం ఉన్న ప్రదేశం గ్రామ కంటానికి చెందిన ప్రభుత్వ భూమి అని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది ప్రభుత్వ భూమి అని తేలినందున ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని, సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని, మరియు మిగిలిన భూమిని కూడా సర్వే చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చెముడులంక నుండి దుళ్ళకు వెళ్ళు రోడ్డులో పంట కాలువ చాలాచోట్ల ఆక్రమణకు గురి అయిందని, గుర్తించి వెంటనే ఆక్రమణలు తొలగించాలని, పంట కాలువ ద్వారా రైతులకు సకాలంలో నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు.

గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, చిట్టూరి అమ్మిరాజు, ఇంచార్జ్ తాసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, బోడపాటి గోపి, ముద్రగడ జెమ్మి, గట్టి సుబ్బారావు, సూరపు రెడ్డి భరత్ కుమార్, మెర్ల అయ్యప్ప, వట్టుకూటి దత్తుడు, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, గుత్తుల కృష్ణ, యనమదాల రాజు, ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ, ఏ.ఈ కాయల సత్యనారాయణ, గోపి ప్రసాద్, కులపాకుల సత్యనారాయణ, మరియు పలు శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page