MLA Adireddy Srinivas : విద్యార్ధులకు బాసటగా నిలుస్తున్న విద్యా ‘‘కిరణా’’లు

TRINETHRAM NEWS

పేద విద్యార్ధుల కోసం విద్యా శిక్షణ అభినందనీయం

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

విన్నర్స్‌ అకాడమీ ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌ సెంటర్‌ సందర్శన

రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ :

పేద విద్యార్ధులను ఆదుకునేందుకు ఉన్నతమైన భావాలు, ఉన్నత స్థాయిలో ఉన్న వారు ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ భవన్లో నిర్వహిస్తున్న విన్నర్స్‌ అకాడమీ ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌ సెంటర్‌ ను మంగళవారం ఆయన సందర్శించి పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధులకు హాల్‌ టికెట్లు అందచేశారు. అనంతరం ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌ తీసుకుంటున్న సుమారు 150 మంది పిల్లల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విన్నర్స్‌ అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ బత్తుల కిరణ్‌ బాబు చేస్తున్న సేవలను అభినందించారు.

ఎన్నో కష్టాలు అనుభవించి ప్రస్తుతం ఒక ఉన్నత స్థానంలో ఉన్న బత్తుల కిరణ్‌కు పేద విద్యార్ధులు పడే ఇబ్బందులు తెలుసుకనుకే తన సొంత ఖర్చులతో పేద విద్యార్ధుల కోసం పాలిటెక్నిక్‌ కోచింగ్‌ ఇస్తున్నారని తెలిపారు. కాగా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ ఏడాది నుంచి నాణ్యమైన యూనిఫామ్‌… షూ అందజేస్తుందని, వాటికి తమ కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్‌ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్టుగా నామకరణం చేయడం శుభసూచకమన్నారు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషమన్నారు. దానిని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సూచించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాజమండ్రిని స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ గా మారుస్తున్నామని, 30వేల ఎస్‌ఎఫ్టీతో టిసిఎస్‌ స్కీల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు. విద్యార్థులు జీవితంలో స్థిరపడాలి అంటే కష్టపడి చదువుకోవాలని ఆయన తెలిపారు.

ఈనెల 30వ తారీకు జరగబోతున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలు అందరూ జాగ్రత్తగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ అవకాశం చక్కగా వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బత్తుల కిరణ్‌ బాబు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విన్నర్స్‌ అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ బత్తుల కిరణ్‌ బాబు, క్రెడాయ్‌ సెక్రటరీ చల్లా బాలమురళి, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Educational ‘‘Rays’’ Supporting Students

You cannot copy content of this page

Scroll to Top