WhatsApp Image 2024 10 26 at 09.46.52
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్: అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, పోలీస్ స్టేషన్లో పూర్వం ఎస్సైగా పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిన, ఎస్సై కె. రామకృష్ణను సస్పెండ్ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీచేశారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఏడాది జూలై నెల నాల్గవ తేదీన ఇరవై కిలోల గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేయకుండా వారితో కుమ్మక్కై వారి నుంచి, రూ. 1,25,000 సొమ్మును ఆన్లైన్లో లంచం తీసుకున్న ఘటన బయటకు వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ విచారణ జరిపి అందించిన నివేదిక మేరకు ఎస్సై రామకృష్ణను సస్పెండ్ చేస్తూ డిఐజి గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులను జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
