బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

TRINETHRAM NEWS

Trinethram News : రాయ్‌పుర్ : ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.
బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్‌లోని భుర్రిపాని గ్రామానికి చెందిన బీజేపీ నేత కైలాష్ నాగ్ వృత్తి రీత్యా గుత్తేదారు. తన గ్రామంలో చెరువు తవ్వడం కోసం ఆయన జేసీబీని అధికారులకు ఇచ్చారు. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.

చెరువు తవ్వకం పనులు జరుగుతున్న సమాచారం తెలుసుకున్న నక్సలైట్లు గ్రామానికి చేరుకున్నారు. అనంతరం జేసీబీకి నిప్పంటించారు. అడ్డొచ్చిన కైలాష్ నాగ్‌ను దారుణంగా కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. వారంలో ఇద్దరు బీజేపీ నేతలను హత్య చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గత వారం, బీజాపూర్ జిల్లాలోని టోయ్నార్ గ్రామంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన స్థానిక బీజేపీ నేత తిరుపతి కట్లని నక్సలైట్లు హత్య చేశారు. 2023 నవంబర్‌లో బీజేపీ నారాయణపూర్ జిల్లా ఉపాధ్యక్షుడు రతన్ దూబేను దారుణంగా నరికి చంపారు. 2023 జూన్‌లో బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేత హత్యకు గురయ్యాడు.

You cannot copy content of this page

Scroll to Top