ఆగస్ట్ 15, 2026

WhatsApp Image 2023 12 11 at 11.35.25 AM 1

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి:డిసెంబర్ 11
తిరుమల తిరుపతి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 73,091 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 23,246 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు…..

You cannot copy content of this page