దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన.. మోదీ ఒకవైపు.. కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భాజపా జాతీయ మండలి సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కూటమి నేతలు తమ వారసులను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. భాజపాలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక చాయ్‌వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదని అన్నారు. మోదీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారని పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిందని ధ్వజమెత్తారు….
మళ్ళీ మోడీదే అధికారం : షా
Related Posts
MP Rakesh Rathore : అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు
TRINETHRAM NEWSఅత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు Trinethram News : ఉత్తరప్రదేశ్ – సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన మహిళ మహిళ…
Mahakumbh Mela : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
TRINETHRAM NEWSమహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం Trinethram News : Uttar Pradesh : మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్‌వద్ద గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు…