నవంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Enamalla Naveen

—- లక్ష్య మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

— స్కూల్ చుట్టూ మిల్లు లు , పెట్రోల్ బంక్. సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ..

— ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు యూనిఫామ్ , పుస్తకాల అమ్మకం.

.—ఎనమల్ల నవీన్ , ఏ ఐ వై ఎఫ్.

Enamalla Naveen : డిండి( గుండ్లపల్లి) నవంబర్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నల్గొండ జిల్లా డిండి (గుండ్లపల్లి) మండల కేంద్రంలో లక్ష్య మోడల్ స్కూల్ పేరుతో పర్మిషన్ తెచ్చుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లక్ష్య పాఠశాల యజమాన్యం సోమవారం స్థానిక గుండ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి గుండ్లపల్లి మండల స్థాయి ప్రజావాణిలో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నవీన్,డిండి మండల అధ్యక్షులు కాంపల్లి ప్రవీణ్ ఉపాధ్యక్షులు నూనె భూపాల్ ఆధ్వర్యంలో లక్ష్య పాఠశాలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు అంటూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
ఈసందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ ఆ పాఠశాల ఏ వాతావరణంలో నడుపుతున్నారు పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారా ఇస్తే ఎంఈఓ ఏం చేస్తున్నారు ఆ పాఠశాలకు ఒకపక్క పల్లీల మిల్లు మరియు రైస్ మిల్లు,మరొకపక్క రైస్ మిల్లు,ఒకపక్క పెట్రోల్ బంక్,మరొకపక్క సిమెంట్ బ్రిక్స్ తయారీ దుమ్ముతో కూడుకున్నటువంటి ప్రాంతంలో నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు పాఠశాల నడుపుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు ప్రాణాలతో చెలగాటమాడుతున్న లక్ష్య పాఠశాల యాజమాన్యం పైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఆ పాఠశాల అనుమతులను రద్దు చేయాలని కోరారు.

విద్యార్థుల ఆరోగ్యాలు మరియు వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు.పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలి నాలి చేసి ఈ కష్టకాలంలో తమ పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏది ఆలోచించకుండా ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది.అందులో చదివే విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారని కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను ఆ పాఠశాల మాన్పించి వేరే పాఠశాలలో జాయిన్ చేయడం కూడా జరిగిందనీ.విద్యార్థుల ఫీజు విషయంలో కూడా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫీజులు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యూనిఫాం , పుస్తకాలకు అధిక ధరలకు విక్రయిస్తూ , యాజమాన్యం ఇష్టారీతి గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకపక్క ప్రమాదంగా పొంచి ఉన్న పెట్రోల్ బంక్ పక్కనే ఈ పాఠశాల నడపడం చాలా దారుణమని అనుకోని సందర్భంలో ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) పక్షాన అధికారులను అడుగుతున్నామని తెలిపారు
లక్ష్య పాఠశాల పైన చర్యలు తీసుకొని వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేసా రు. లేదంటే పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న లక్ష్య యజమాన్యం పై చర్యలు తీసుకొని వాటి అనుమతులను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని వెంటనే జిల్లా విద్య అధికారి డీఈవో మరియు ఎంఈఓ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page