
-రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం
–కేసీఆర్ నాటి రైతు సంక్షేమాన్ని తిరిగి సాధించుకునేందుకే బీఆర్ఎస్ పోరాటం
-దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
Ravindra Kumar : దేవరకొండ డివిజన్ నవంబర్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటల గారడీలతో కాలయాపన చేస్తోందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు.సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామానికి చెందిన 20కుటుంబాలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..అడ్డమైన హామీలు, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు, విమర్శలు పక్కనపెట్టి ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్, ఎరువులు అందించడంతో పాటు రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ,సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, దూదిపాల రాజేందర్ రెడ్డి, తోటకూరి పరమేష్, ఎర్ర యాదగిరి,బొడ్డుపల్లి మహేందర్, బొగది కృష్ణా రెడ్డి,అనిల్,తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమావత్ రవి,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రమావత్ యాదగిరి, వార్డు సభ్యులు రమావత్ నాగు, జటావత్ అచ్చి,రమావత్ హనుమంత్, కాంగ్రెస్ నాయకులు రామావత్ భగవాన్,భాస్కర్, అనిల్, బాల్ సింగ్,రమేష్, మూడవతు రెడ్డి, రమావత్ రమేష్,వెంకట్రామ్, దేవ్ సింగ్, బాలు నాయక్,బిక్షం, మోతిలాల్, దానవత్ సాంబ,రమావత్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe