
–+ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ ఇన్వర్డ్ సెక్షన్), విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ కె. సత్యనారాయణ రెడ్డికి ఆర్టీఐ సేవా సొసైటీ వినతిపత్రాలు
- 107 రోజులు గడుస్తున్నా పేరు మార్చుకోని యాజమాన్యం.. రోజుకు రూ. 10 వేల జరిమానా ఎక్కడ?
- కొండమల్లేపల్లి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణం, అనుమతి లేని హాస్టల్ నిర్వహణ
- లాబీయింగ్ ఒత్తిడితో ఆర్జేడీ కార్యాలయంలో మాయమైన ఫైలు.. స్కూల్ సీజ్, విజిలెన్స్ విచారణకు డిమాండ్.
SPR School : దేవరకొండ డివిజన్ నవంబర్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబు రామ్ నాయక్ (ఎం.టెక్) ఆధ్వర్యంలో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందజేశారు. హైకోర్టు, కమర్షియల్ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నల్గొండ (డీవీకే రోడ్), కొండమల్లేపల్లిలలో సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్రమంగా నడుస్తున్న “ఎస్పీఆర్ హైస్కూల్” పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేతావత్ బాబు రామ్ నాయక్, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షులు ఎండీ సిరాజ్‌తో కలిసి తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ ఇన్వర్డ్ సెక్షన్), పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరియు సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ & డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ కె. సత్యనారాయణ రెడ్డి కి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.
వినతిపత్రంలోని ప్రధాన అంశాలు:
- కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన & జరిమానా వైఫల్యం: ‘ఎస్పీఆర్’ పేరును వాడకూడదని కమర్షియల్ కోర్టు (సీ.ఓ.ఎస్. నెం. 21/2024) మరియు తెలంగాణ హైకోర్టు (రిట్ పిటిషన్ నెం. 12250/2026) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం 45 రోజుల్లోగా పాఠశాల పేరు మార్చుకోవాలని ఆర్‌జేడీఎస్‌ఈ, నల్గొండ డీఈవో ఆగస్టు 1, 2026న నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి దాదాపు 3 నెలలు (107 రోజులు) గడుస్తున్నా పాత పేరుతోనే అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ యాక్ట్) సెక్షన్ 18(5) ప్రకారం రోజుకు రూ. 10,000 చొప్పున జరిమానా విధించాల్సి ఉన్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జీవో నెం. 91కి విరుద్ధంగా ‘ఐఐటీ-జేఈఈ’, ‘ఒలింపియాడ్’ పేర్లతో బ్రోచర్లు పంచుతూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు.
- ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం – విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం: కొండమల్లేపల్లి క్యాంపస్ భవనాన్ని వాల్టా చట్టానికి విరుద్ధంగా చెరువు ఎఫ్టీఎల్ / బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించారు. అంతేకాకుండా, ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ, విద్యాశాఖ మరియు సంక్షేమ శాఖల అనుమతులు లేకుండానే బాలుర హాస్టల్ నిర్వహిస్తూ వందలాది మంది గిరిజన (ఎస్టీ), గ్రామీణ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.
- ఆర్జేడీ కార్యాలయంలో ఫైలు మాయం: ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్టీఐ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదుపై ఆరా తీయగా, హైదరాబాద్ ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయ సిబ్బంది “ఫైలు కనిపించడం లేదు/మాయమైంది” అని చెప్పడం విస్మయానికి గురిచేస్తోందని కేతావత్ బాబు రామ్ నాయక్ ఆరోపించారు. ఉన్నత స్థాయి లాబీయింగ్, ఒత్తిళ్ల వల్లే కింది స్థాయి అధికారులు నిస్సహాయంగా మారారని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీఐ సర్వీస్ సొసైటీ ప్రధాన డిమాండ్లు: - పదో తరగతి పరీక్షా ఫీజులకు అనుమతి నిరాకరణ: గుర్తింపు, సరైన పేరు లేని ఈ పాఠశాలల నుండి 2027 మార్చి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులు, నామినల్ రోల్స్ స్వీకరించకుండా ఎస్ఎస్సీ బోర్డు, ఆర్జేడీ, డీఈవోలకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలి.
- పాఠశాల, హాస్టల్ సీజ్ & కూల్చివేత: నల్గొండ డీవీకే రోడ్, కొండమల్లేపల్లి క్యాంపస్‌లతో పాటు అనుమతి లేని బాలుర హాస్టల్‌ను తక్షణమే సీజ్ చేయాలి. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.
- విజిలెన్స్ విచారణ & జరిమానా వసూలు: ఆర్జేడీ కార్యాలయంలో ఫైలు మాయమవ్వడంపై విజిలెన్స్ మరియు శాఖాపరమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రెండు పాఠశాలల నుండి రోజుకు రూ. 10 వేల చొప్పున 107 రోజుల జరిమానాను వసూలు చేయాలి.
- విద్యార్థులకు న్యాయం & క్రిమినల్ కేసులు: ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా సమీపంలోని గుర్తింపు పొందిన పాఠశాలల్లో సర్దుబాటు చేయాలి. మోసానికి పాల్పడిన యాజమాన్యంపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 318(4) కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
ఈ కార్యక్రమంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబు రామ్ నాయక్, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షులు ఎండీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe