
–ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం.
Safeguard Public Education Sector : డిండి (గుండ్లపల్లి) నవంబర్ 04, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యా యుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం తెలంగాణ రాష్ట్రం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇటీవల కట్టంగూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన టి.ఎస్ యుటిఎఫ్ నలగొండ జిల్లా ఏడవ మహాసభలో డిండి మండలానికి చెందిన నాయకులు జిల్లాస్థాయి పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో జిల్లా కార్యదర్శిగా గండమల్ల రామారావు, ఎఫ్ డబ్ల్యూ ఎస్ రాష్ట్రకౌన్సిల్ మెంబర్గా నేనావత్ పూర్య, జిల్లా కమిటీ సభ్యురాలిగా ఎం సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులందరినీ ఐక్యంగా ముందుకు నడిపిస్తామని తెలిపారు హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు .డిండి ప్రాంతానికి చెందిన నాయకులు జిల్లాస్థాయి కమిటీలో కీలక పదవులకు ఎన్నిక కావడం పట్ల ఉపాధ్యాయులు సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe