సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Pension Distribution.

Pension Distribution : విజయనగరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 25 ; గజపతి నగరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ బ్యాంకులకు వరుస సెలవులు నేపద్యంలో వచ్చే నెల అనగా అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలిపారు.

అదే రోజు నగదు విత్ డ్రా పై బ్యాంకులకు ఎస్ ఎల్ బి సి ఆదేశాలు జారి అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6180 లక్షల మంది సంబంధిత లబ్ధిదారులకు 2,692 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వివరించారు. అయితే కొత్త పెన్షన్ పంపిణీ ఉండదని సమాచారం. ఈ ప్రకటన బ్యాంకు సమ్మె నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ పై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు తెరదించింది.

పెద్దలు ప్రతిరోజూ వేసుకునే మందులను (Tablets) మర్చిపోకుండా క్రమపద్ధతిలో అమర్చుకోవడానికి ఈ ‘వీక్లీ పిల్ ఆర్గనైజర్ బాక్స్’ను ఇక్కడ కొనుగోలు చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page