ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
100% Reservation

100% Reservation : డంబ్రిగుడ ఆగస్టు 19, (త్రినేత్రం న్యూస్): ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో జారీ చేసి, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.
డంబ్రిగుడలో నిర్వహించిన సమావేశంలో బాలదేవ్ మాట్లాడుతూ 2026 డీఎస్సీలో గిరిజన యువతకు అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. 1/70 చట్టం పరిరక్షణపై ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని, సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి చట్టానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
సమావేశంలో సంఘం నాయకులు సత్యనారాయణ, సురేష్‌కుమార్, లైకాన్ రామచంద్ర, సీతారామ్, వసంత్, మోహన్, అరుణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page