ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Fire Breaks Journalist House

విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధం.. తోటి జర్నలిస్టులు ఆదుకోవాలని విజ్ఞప్తి….

Fire Breaks Journalist House : కూకట్‌పల్లి “త్రినేత్రం” న్యూస్ దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న జర్నలిస్ట్ మనోహర్ కుటుంబానికి అనుకోని అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సమీపంలోని లెనిన్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్న మనోహర్ ఇంట్లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని విలువైన వస్తువులు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.

ఎన్నో ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న మనోహర్ కుటుంబం ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఊహించని ప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన తోటి జర్నలిస్ట్ కుటుంబానికి జర్నలిస్ట్ మిత్రులు, మీడియా ప్రతినిధులు, మానవతావాదులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని సహచరులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సహాయం చేయదలచిన వారు:
మనోహర్
త్రినేత్రం న్యూస్ – రిపోర్టర్, కూకట్‌పల్లి
PhonePe / Google Pay: 9133169016

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page