
Har Ghar Tiranga : దేవరకొండ డివిజన్ ఆగష్టు 14, త్రినేత్రం న్యూస్ : మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో ఎన్ సి సి విభాగం సి టి ఓ జి. కోటయ్య ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ దేశంలోని పౌరులందరూ తమ తమ ఇళ్ల పైన జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుతూ మన దేశ ఐక్యమత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, డా„ కె.రేణుక తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe