Har Ghar Tiranga : జాతీయభావం పెంపొందాలి

TRINETHRAM NEWS

మండపేట లో 500 అడుగుల పొడవు జాతీయ పతాకం ర్యాలీ…

హర్ ఘర్ తిరంగా లో ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, భారతీయులు ప్రతీ ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఏర్పాటుచేసిన ర్యాలీ ని వీరు ఇరువు కలసి ప్రారంభించారు. రథం సెంటర్ నుండి కలువ పువ్వు సెంటర్ పుర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్దులు, మెప్మా ఆర్.పి లు, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో ఊరేగింపుగా సుమారు 500 అడుగులు పొడవు ఉన్న జాతీయ జెండా తో ర్యాలి నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా ఓ పవిత్ర మైన కార్యక్రమం అన్నారు. మనదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో నేతలు త్యాగాలు చేసి బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయారన్నారు. అటువంటి మహానుభావులను స్మరించుకుంటూ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవెయ్యాలన్నారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో జాతీయ భావం పుట్టుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, 17వ వార్డు కౌన్సిల్ సభ్యులు కాళ్ళకూరి స్వరాజ్య భవాని శ్రీనివాస్, సిరంగు ఈశ్వరరావు, మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు, పాలచర్ల శిరీష్, ముత్యాల పట్టాభి, ముమ్మిడివరపు నారాయణ, బండి గోవిందు, పెనుమత్స వెంకటవర్మ రాజు, తీగిరెడ్డి ప్రశాంత్, మునిసిపల్ రెవిన్యూ ఆఫీసర్ జె.వి.యస్.శాస్త్రి, డి.ఇ,ఇ. కె.శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్లు డి.పవన్ కుమార్, ఆర్. అనుష లక్ష్మి, మెప్మా సిఎంఎం పి.సుజాత, ఆర్.పి లు, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nationalism should be developed

You cannot copy content of this page

Scroll to Top