
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి… తీదేడు గ్రామ సర్పంచ్
Village Development : చింత పల్లి ఆగస్టు 14, త్రినేత్రం న్యూస్. తీదేడు గ్రామ సర్వతోముఖ అభివృద్ధే లక్ష్యంగా గ్రామ సభ సమావేశం నిర్వహించడం జరిగిందని సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో గ్రామ ప్రజల సమస్యలు మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి,వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని,గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, అభివృద్ధి చెందిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని ఆమె తెలిపారు.మన గ్రామం మన బాధ్యత అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,సందె లక్ష్మయ్య,మర్ల యాదగిరి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రమావత్ కిరణ్ కుమార్,అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe