ఆగస్ట్ 14, 2026
TRINETHRAM NEWS
Donation by Alumni

Donation by Alumni : డిండి గుండ్ల పల్లి ఆగష్టు 14, త్రినేత్రం న్యూస్. డిండి మండలం కామేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( జెడ్ పి హెచ్ ఎస్) 2004-2005 విద్యాసంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు అత్యంత అవసరమైన మైక్ సెట్ , సౌండ్ బాక్స్ లను పాఠశాలకు బహుమతిగా అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఈ వస్తువులను ఉపాధ్యాయులకు అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం లాంటి జాతీయ పండుగలకు మరియు పాఠశాల రోజువారీ ప్రార్థన సమయాల్లో ఈ మైక్ సిస్టం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, 2004-2005 బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొన్నారు. తమ పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page