ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Korrayi Culvert Incomplete

Korrayi Culvert Incomplete : డుంబ్రిగూడ, ఆగస్టు 14, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం అరకు–ఒడిశా ప్రధాన రహదారిలోని కొర్రయి కల్వర్టు నిర్మాణ పనులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రయి కల్వర్టు ప్రాంతాన్ని ఆమె పరిశీలించి, సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మార్గంపై ఆధారపడుతున్న రెండు పంచాయతీల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కల్వర్టు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు.
ఈ రహదారి ద్వారా రైతులు, విద్యార్థులు, గర్భిణులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారని సుజాత సల్మాన్ తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారి బురదమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని పేర్కొన్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కల్వర్టు పనులను ఇకపై ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన కల్వర్టు నిర్మాణ పనులు నాలుగేళ్లుగా ఎందుకు నిలిచిపోయాయో ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో స్థానిక ప్రజలతో కలిసి శ్రమదానం ద్వారా రహదారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన విషయాన్ని సుజాత సల్మాన్ గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం పరిధిలోనైనా కొర్రయి కల్వర్టు పనులను చేర్చి వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు.
మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొర్రయి కల్వర్టు సమస్య అధికారుల దృష్టికి ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను ఇకనైనా గుర్తించి కల్వర్టు పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page