
Pending DA must Released : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 13, త్రినేత్రం న్యూస్. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( USPC) పిలుపు మేరకు నాలుగు దశల పోరాటంలో భాగంగా డిండి( గుండ్లపల్లి) మండల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కి భోజన విరామ సమయంలో మెమోరండం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గండమల్ల రామారావు మాట్లాడుతూ …. పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, పెండింగ్ DA లను విడుదల చేసి మరియు నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలు అన్నీ కూడా విద్యార్థుల సమస్యలే అని తెలియజేస్తూ తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి రాంబాబు, FWF కన్వీనర్ ఖాజా రెహమతుల్లా మరియు సీనియర్ నాయకులు తిరుపతయ్య, యాదయ్య, బుజ్జిరాని, షాహిన్, అనిత ,పావని, తెరిసా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe