ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

చింతపల్లి మండల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి :

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

MLA Balu Naik : చింత పల్లి ఆగష్టు 13, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల కేంద్రంలోని మండల “ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో” దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్ * పాల్గొని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండలంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను గుర్తించి గ్రామాల వారీగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

రెవెన్యూ శాఖ: ప్రజలు మరియు రైతుల భూ సమస్యలు, భూ రికార్డుల సమస్యలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు తదితర సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

వ్యవసాయ శాఖ: రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సలహాలు సకాలంలో అందేలా చూడాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేపించాలని, పంటల సాగులో రైతులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ: గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్య పనులు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

VBGRAMG (ఉపాధి హామీ శాఖ) : గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

విద్యాశాఖ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, నాణ్యమైన విద్య, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

వైద్య–ఆరోగ్య శాఖ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల అధికారులను గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

మహిళా–శిశు సంక్షేమం, పౌరసరఫరాలు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరుతున్న తీరుపై సమీక్షించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు-సంజీవరెడ్డి, డిఎల్పిఓ, ఎంపీడీవో, తహసీల్దార్, మండల ప్రత్యేక అధికారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page