
General Body Meeting : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 12, త్రినేత్రం న్యూస్. డిండి మండల MPDO నర్రా వేజన్న అధ్యక్షతన మండల ప్రజా పరిషత్, గుండ్లపల్లి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి దేవరకొండ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో గౌరవ DLPDO దేవరకొండ శంకర్ నాయక్ , MPO గొరటి జంగయ్య , APO శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, అన్ని గ్రామ పంచాయతీల గౌరవ సర్పంచులు మరియు అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
మండల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని గౌరవ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సూచించడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe