
- శాలువాతో సత్కరించిన RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్
Birthday Wishes Rapolu Mohan : దేవరకొండ 12 ఆగస్టు త్రినేత్రం న్యూస్. పోలీస్ నిఘా వర్గానికి చెందిన నల్గొండ జిల్లా ప్రతినిధి రాపోలు మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్టివిస్ట్ సొసైటీ (RTIAS) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ స్వయంగా మోహన్‌ను కలిసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మోహన్‌ను శాలువాతో సత్కరించి, ఆయన సేవలను అభినందించారు. విధుల్లో వారు చూపుతున్న అంకితభావం, నిజాయితీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాపోలు మోహన్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చాట్ల రాములు తెలుగు పల్లి సర్పంచ్, దేవరకొండ పోలీస్ నిఘా ప్రతినిధి పులిజాల గోవర్ధన్ తదితరులు పాల్గొని రాపోలు మోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe