
MLC Sripal Reddy : దేవరకొండ డివిజన్ ,జూలై 01 , త్రినేత్రం న్యూస్. జిల్లా పరిషత్ హై స్కూల్ పడమటిపల్లిలో క్రాఫ్ట్ టీచర్ గా పనిచేసిన నారాయణ సింగ్ ఉద్యోగ విరమణ సందర్భంగా ,పడమటిపల్లి లో శుభమస్తు ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఖమ్మం ,నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు.ఉపాధ్యాయుల సమస్యల పట్ల పి ఆర్ టి యు సంఘం ముందుండి పోరాటం చేస్తుందని, శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం తన గళం వినిపిస్తున్నానని శ్రీపాల్ రెడ్డి అన్నారు.
పదవీ విరమణ పొందుతున్న నారాయణ్ సింగ్ పి ఆర్ టి యు సంఘానికి సేవలు అందించారని ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా పనిచే సి ,దేవరకొండ ప్రాంతంలో, దిండి మండలంలో పిఆర్టిని బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారని తెలిపారు.రిటైర్డ్ టీచర్స్ పెండింగ్ బిల్లులను ఇప్పించుటకు, ముఖ్యమంత్రిని పలుసార్లు కలిసి విన్నయించానని దాని ఫలితమే నెల వారిగా రెండు వేల కోట్ల చొప్పున ప్రభుత్వము రిటైర్డ్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో 30 శాతం పి ఆర్ సి ని, మూడు సంవత్సరముల సర్వీసును, సాధించడం పి ఆర్ టి యు ఘనతగా ఆయన తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వము ఇవ్వబోయే పిఆర్సి మెరుగైన రూపంలో ఇప్పిస్తామని ,దానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు .నా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ఉపాధ్యాయులకు ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పిఆర్టియు బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంక రి బిక్షం గౌడ్ మాట్లాడుతూ,,ఉపాధ్యాయుల సమస్యల పట్ల పిఆర్టి సంఘం ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.ఉపాధ్యాయ పదవీ విరమణ చేస్తున్న నారాయణ సింగ్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసే, శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని తెలిపారు .దేవరకొండ ప్రాంతంలో పిఆర్టియు సంఘానికి ఎనలేని సేవలు అందించిన నారాయణ సింగ్ మున్ముందు కూడా పిఆర్టి సంఘానికి మద్దతునిచ్చి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
ఇదే సందర్భంలో జిల్లా పిఆర్టియు అధ్యక్షులు కాలం నారాయణ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యుత్తమ మ నీ, ఉపాధ్యాయుడు విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతూ, సంఘంలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.నారాయణ సింగ్ పి ఆర్ టి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ పి ఆర్ టి యు దేవరకొండ ప్రాంతంలో అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేశారని తెలిపారు .పదవి విరమణ పొందిన నారాయణ సింగ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహ, గాయకుడు పల్లె నర్సింహ, తమ పాటలతో సభను ఉర్రూతలూగించారు .ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,,జిల్లా కార్యదర్శి జాన్ రెడ్డి, కిరణ్ కుమార్, పడమటిపల్లి సర్పంచ్ పళ్ళ శ్రీకాంత్ రెడ్డి, చెరుకుపల్లి సర్పంచి రామచంద్రయ్య, జా లే నరసింహారెడ్డి , పోలా శ్రీనివాసులు, డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, బిక్కు నాయక్, గోపియా నాయక్,,అడపాల శేఖర్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్ ,రిటైర్డ్ సంఘం సభ్యులు అంకం చంద్రమౌళి ,సత్యమూర్తి వనం బుచ్చయ్య , వంగాల శేఖర్ రెడ్డి తోపాటు పలువురు రిటైర్డ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తిప్పర్తి రుక్మారెడ్డి, గోపాల్ రావు చెరుకుపల్లి గ్రామస్తులు అడపాల మాధవరెడ్డి, తూమ్ సుమిత్ రెడ్డి ,అడపాల తిరుపతిరెడ్డి అడపాల వెంకట రమణారెడ్డి, అడపాల జంగారెడ్డి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణ సింగ్ బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా సన్మానించారు . పాఠశాల విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి .నారాయణ సింగ్ మాట్లాడుతూ నా సన్మాన సభకు ఇంత పెద్ద ఎత్తున హాజరై నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe