డిండి ( గుండ్లపల్లి )డిసెంబర్ 23 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో గణిత ఉపాధ్యాయుడు ముడి లింగమయ్యను విద్యార్థులు శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకుంటామని కొనియాడారు.
గణిత ఉపాధ్యాయుడు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణితాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడని, ప్రతి నిత్యం అందరు కూడా గణితాన్ని ఇదోరకంగా ఉపయోగిస్తూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్, సినీ, భార్గవి, కీర్తి, మహర్జున, పూజ, సంధ్య మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


