-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వైస్ చాన్సలర్ ఆచార్య డాక్టర్ వెల్దండ నిత్యానందరావు.
-భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి.
-రిజిష్ట్రార్ ఆచార్య డాక్టర్ కోట్ల హనుమంతరావు.
కూకట్పల్లి,జనవరి 26 (త్రినేత్రం న్యూస్) : బాచుపల్లి సాయినగర్ పరిధిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య డాక్టర్ వెల్దండ నిత్యానందరావు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, విశ్వవిద్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశానికి మార్గదర్శకమని,సమానత్వం, న్యాయం,సౌభ్రాతృత్వం వంటి విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.
దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, వివిధ జాతులు,మతాలు, కులాలు, పౌరహక్కులు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సామజిక న్యాయం జరగాలని రాజ్యాంగం అంబేద్కర్ రూపొందించారన్నారు.అలాగే గణతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
యూనివర్సిటీ రిజిష్ట్రార్ ఆచార్య డాక్టర్ కోట్ల హనుమంతరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యూనివర్సిటీలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని,అలాగే యూనివర్సిటీ తరపున మైసూర్ లో జరిగే జాతీయస్థాయి క్రికెట్ క్రీడా పోటీలకు తరలి వెళ్తున్న క్రికెట్ జట్టుకు సారధ్యమయిస్తున్న స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ తో పాటు క్రీడాకారుల జట్టును అభినందించారు.
ఈ క్రికెట్ జట్టుకు దాతలు డీఎస్పీ మాదనం గంగాధర్ క్రికెట్ కిట్టును అందజేశారు. 2025-26 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ మెన్ జనవరి 27 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో పార్టిసిపేట్ అయ్యే విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ శాఖల విద్యార్థుల మధ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే క్రికెట్ పోటీలు నిర్వహించి,అర్హులైన ప్రతిభ కలిగిన 15 మంది విద్యార్థులను ఎంపిక చేసి టోర్నమెంట్ కు పంపడం జరుగుతుందని,మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయం తరపున పాల్గొనబోయే క్రికెట్ జట్టుకు విద్యార్ధులు, సిబ్బంది,రిజిస్ట్రార్ మరియు వైస్ ఛాన్సలర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో గోపాల్ ని రిజిస్ట్రార్ శాలువాతో సత్కరించి,ఘనంగా సన్మానించారు. ఈ క్రికెట్ జట్టులో డి.వాస్రామ్ కెప్టెన్,పి.ప్రవీణ్ – వైస్ కెప్టెన్,హెచ్.మనోజ్ – వికెట్ కీపర్,సి.వినోద్,ఎస్.సిద్ధార్థ,ఎం.అరుణ్ – వికెట్ కీపర్,సి.జీవన్ వికెట్ కీపర్,విజయ్ కుమార్,శ్రీనివాస్,ఆర్.శ్రీకాంత్,భరత్,మహేష్,రాజు,ఉదయ్ కుమార్, జె.వినోద్ తదితరులు పాల్గొంటారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


