Republic Day : ఘనంగా ఆర్ ఎస్ ఆర్ లో 77వ గణతంత్ర దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 26: బోగోలు మండలం: కడనూతల బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు.

వారు ముందుగా త్రివర్ణ పతాకమును ఎగురవేసి సెల్యూట్ చేసిన తర్వాత మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే. రాజారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ప్రతి విద్యార్థిని విద్యార్థి తప్పక పాటించి దేశ శ్రేయస్సు కోసం తన వంతు కృషి చేయాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఆర్ వి రమణారెడ్డి, ఈఈఈ డిపార్ట్మెంట్ హెచ్ ఓ .డి. డాక్టర్ వి. రవీంద్రారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఏ. కిరణ్ కుమార్, అన్ని విభాగాలు అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు బీటెక్ విద్యార్థులు, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77th Republic Day celebrated in RSR

You cannot copy content of this page

Scroll to Top