Trinethram News : May 20, 2025, తెలంగాణ : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో 109 దేశాల సుందరీమణులు పాల్గొంటుండగా.. వీరిలో 48 మంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి వారిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందని మిస్‌వరల్డ్ నిర్వహకులు వెల్లడించారు. మంగళవారం, బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


