జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 7.47.29 PM

TRINETHRAM NEWS

విజయవాడ:- 21-12-2023.

యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది-
రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు.

ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మడకశిర నియోజకవర్గ TNTUC అద్యక్షుడు బాలేపల్లి రాజు.

మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు మాట్లాడుతూ:-
శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరలివచ్చి నవ శకానికి నాంది పలికారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు పేర్కొన్నారు. యువగళం పాదయాత్రకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు,బాలకృష్ణ గారు సభకు విచ్చేసి కార్యకర్తలకు ఉత్సాహాన్ని అందించారని ఈ సభ విజయవంతం కావడంతో వైకాపా నేతల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు.. టిడిపి జనసేన పొత్తు చారిత్రాత్మకమని చంద్రబాబు గారు పేర్కొనడం ద్వారా ఈ రాష్ట్రంలో తిరిగి టిడిపి జనసేన కూటమి అధికారం చేజెక్కించుకుంటుందన్నారు. ఈ రెండు పార్టీల పొత్తు కేవలం ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జనం టిడిపి జనసేన కూటమికి 160 శాసనసభ స్థానాలు 25 అసెంబ్లీ స్థానాల్లో విజయం అందించాలన్నారు చంద్రబాబు నాయుడు ది విజినరీ అయితే జగన్ ది ఫ్రిజినరీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు విద్య వైద్యం మౌలిక వసతులు కల్పించే బాధ్యతను టిడిపి పార్టీ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

You cannot copy content of this page