YSR’s 76th Jayanti : ఘనంగా వైఎస్ఆర్ 76 వ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) నియోజకవర్గఇంచార్జ్ : జన హృదయ నేతకు ఘన నివాళులు అర్పించిన శాసన సభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి సందర్భంగా పాడేరు జిల్లా కేంద్రంలో పాడేరు శాసన సభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు అధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి పాడేరు పాత బస్టాండ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రతి పేద కుటుంబానికి బాసటగా నిలిచి సంక్షేమానికి పెద్దపీట వేసి చరిత్ర తిరగరాసి తెలుగు ప్రజల గుండెల్లో చేరగరాని ముద్ర వేసుకున్నారని అన్నారు. వైయస్సార్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా తండ్రి బాటలో నడుస్తూ కులాలు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా తండ్రికి తగ్గ తనయుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి 2014 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పరిపాలించి రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా లబ్ధిదారులు అందరికి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసే విధంగా చేపట్టి,ఇంటింటికి పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSR's 76th birth anniversary

You cannot copy content of this page

Scroll to Top