యువజన విభాగమే పార్టీ బలానికి వెన్నెముక : మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
మహేంద్రవాడ గ్రామ యువజన విభాగ అధ్యక్షుడిగా సబ్బెళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఎంపిక
దుస్సాలువుతో సత్కరించిన మాజీ ఎమ్మెల్యే
Trinethram News : త్రినేత్రం న్యూస్, అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామం. వైయస్‌ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో యువజన విభాగం కీలకపాత్ర పోషించాలి అని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అన్నారు. మహేంద్రవాడ గ్రామానికి చెందిన సబ్బెళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ యువజన విభాగ అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా శుక్రవారం ఆయనను నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు దుస్సాలు కప్పి ఘనంగా అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత పార్టీ బలానికి వెన్నెముకలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి(జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్), తాడి సూరారెడ్డి(మాజీ సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ, జిల్లా ప్రధాన కార్యదర్శి), ర్యాలీ సత్తిబాబు, మల్లిడి చెల్లారెడ్డి, మేడపాటి శ్రీనివాస రెడ్డి, సబ్బెళ్ల సత్యనారాయణ రెడ్డి,సబ్బెళ్ల పెద్ద సత్తి రెడ్డి,మల్లిడి నాగేశ్వర రెడ్డి,కర్రి సత్యనారాయణ రెడ్డి, తాడి వెంకట రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి (ఎస్. వి), ద్వారంపూడి వీర రాఘవ రెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


