జూలై 7, 2026

WhatsApp Image 2025 01 09 at 21.30.41

TRINETHRAM NEWS

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల

Trinethram News : Andhra Pradesh : వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు.

లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పక్షాన సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.

మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట.. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని విమర్శించారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పవన్ కల్యాణ్ ను, బీజేపీని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page