తేదీ : 06/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యి కింద పడిపోయి ఉన్నారు. ఈ ఘటన స్థానిక బైపాస్ రోడ్డు బ్రిడ్జి వంతెన దగ్గరలో గల సాహో పుల్కా పాయింట్ ముందు సాంత్రో కారు బైకు ఢీకొనగా బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది.
ఈ సందర్భంలో ఆటువైపు వెళ్తున్నటువంటి సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిబోయిన. నరేష్ , ఎన్ఎస్పి శంకర్, డాక్టర్ మేకల . వేణుబాబు ,పన్నెండు వ వార్డు వైసిపి నాయకులు గుమ్మా. పాపారావు , పరిపూర్ణ నిర్వహకులు సిరికొండ. అభి తక్షణం స్పందించి నిస్సహాయ స్థితిలో కింద పడిపోయిన యువకులకు ధైర్యం చెప్పి నూట ఎనిమిది అంబులెన్స్ కి కాల్ చేసి దగ్గరుండి తిరువూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


