TRINETHRAM NEWS

విద్యార్థులకు నిర్వహించిన ఐడియేషన్ బూట్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, మార్చి -11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. యువత ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు వీ హబ్ సహాకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విద్యార్థులకు నిర్వహించిన ఐడియేషన్ బూట్ క్యాంపు లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ విద్యార్థులు జాబ్ చేసే ధోరణి నుంచి జాబ్ లు సృష్టించాలనే లక్ష్యాలు నిర్దేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు. చిన్నతనం నుంచి మనం పెరిగిన వాతావరణం ఒక మంచి జాబ్ దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆలోచన మనకు ప్రేరేపిస్తుందని, వీ హబ్ ద్వారా యువతకు మరో వైపు గల అవకాశాలు, యువత ఆశయాలకు తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు
చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో వినూత్న ఆలోచనలు చేసి యువత పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించిందని తెలిపారు. స్విగ్గి, ఓయో, రాపిడో, ఓలా వంటి వివిధ కంపెనీలు చిన్న చిన్న ఆలోచనలతో ప్రారంభమయ్యాయని అన్నారు
యువత తనకు పరిమితులు విధించుకోవద్దని, మనం ఆలోచిస్తే సమాజంలో అనేక అవకాశాలు వస్తాయని అన్నారు. చిన్న చిన్న ఆలోచనలతో వచ్చే యువతకు వీ హబ్ ద్వారా వివిధ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు
మన చుట్టూ ఉన్న ఏదైనా సమస్య పరిష్కారానికి యువత ఐడియా తో వస్తే దాన్ని కాదే రూపం దాల్చేందుకు అవసరమైన ఫైనాన్స్ సపోర్ట్, మార్కెటింగ్, ప్రోడక్ట్ తయారీ వంటి వివిధ దశల్లో తోడ్పాటు అందించేందుకు వీ హబ్ పని చేస్తుందని అన్నారు యువత ఆలోచనకు సపోర్ట్ చేసేలా వీ హబ్ లో ఎకో సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ మాట్లాడుతూ 2018 లో వీ హబ్ ను గ్లోబల్ ఎకనామిక్ సమ్మెలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సోషల్ ఇంపాక్ట్ లో భాగంగా మహిళలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ అందిస్తామని తెలిపారు. 17 నుంచి 23 వయసు మధ్యలో గల మహిళ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని అన్నారు వీ హబ్ ద్వారా మహిళా ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. సోంత ఐడియా ఉన్న మహిళలకు సోంత వ్యాపార ఏర్పాటుకు అవసరమైన సహాయం అందిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో వీ-హబ్ సంచాలకులు జహీద్ అక్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, స్టూడెంట్ ప్రోగ్రామ్ లీడ్ జై, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సాయిరాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మురళి, గోదావరిఖని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉష, విద్యార్థిని విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Youth should become job providers