రామగుండం మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు
ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందల గడ్డలా మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్ నిర్మిస్తున్నామని అన్నారు అభివృద్ధి విషయంలో ఎక్కడ ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని అన్నారు. అంతే కాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు
అలాగే సింగరేణి స్థలాలను ఆక్రమించుకున్న వారి నుంచి భూములను తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన ఇప్పటికే డిజైన్ పూర్తి చేశామని, ఇందుకు ప్రజలు వ్యాపారులు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


