TRINETHRAM NEWS

మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధం
అబద్ధాలు చెప్పబోం… నెరవేర్చలేని హామీలు ఇవ్వం
ఇంట్లో కూర్చుంటే కుదరదు… చొరవ చూపాల్సిందే: జగన్‌
Trinethram News : Andhra Pradesh : ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమే కానీ అబద్ధాలు చెప్పబోనని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. నెరవేర్చలేని హామీలను భవిష్యత్తులోనూ ఇవ్వబోనన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. జగన్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదని, చొరవ తీసుకొని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేస్తామని చెప్పారు గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతోందన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండమని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా అని ప్రశ్నించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App