Disciplined Education Teaching : క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన

TRINETHRAM NEWS

తేదీ : 21/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు, మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయలు పాత రెడ్డిగూడెం, మడకం. సుష్మ, నాగుల గూడెం సోడెం. శ్రీను, ఎర్ర బోరు కుంజా. జిజ్జి మేరీ భూదేవి పేట, కె. గంగాజలం, శివకాశి పురం పి. మధు, వెలేరుపాడు కె. నాగసత్యం , మాట్లాడుతూ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కలదు అని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన సమయానుగుణంగా నడుస్తున్నాయని తెలిపారు.
మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో కూడిన పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆటలు కూడా నిర్వహిస్తున్నామని తెలపడం జరిగింది. యోగాడే సందర్భంగా ప్రతి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులతో ఆసనాలు వేయించామని చెప్పారు. ఈ ఆసనాల ద్వారా ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో , మరియు కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయినింగ్ అయినారో తెలపడం జరిగింది. అదేవిధంగా గిరిజన బాలికలఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మడకం. నాగమణి మాట్లాడుతూ పాఠశాలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు వందలు మార్కులకు గాను వె. పూజిత ఐదు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. వెన్నెల నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు పొంది ద్వితీయ స్థానంలో నిలిచింది. కె. శ్రీవల్లి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించిందని తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సిహెచ్. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కదా అని చెప్పారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రంకి రెడ్డి. హర్షవర్ధన్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించాడని తెలిపారు. కర్నాటి. భావన చరణ్య ఐదు వందల నలభై నాలుగు మార్కులు సాధించి ద్వితీయ గెలిచినట్లు తెలిపారు. బుడిపిటి. నిఖిల్ కుమార్ ఐదు వందల ముప్ఫై రెండు మార్కులతో తృతీయ స్థానాన్ని గెలిచాడు అని అన్నారు. వాళ్ల పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో చెప్పడం జరిగింది.
కొత్త అడ్మిషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. మండల పరిషత్ మరియు, జిల్లా పరిషత్ పాఠశాల యందు క్రమశిక్షణతో కూడిన విద్య బోధన, పౌష్టిక ఆహారం విద్యార్థులకు అందించి వాళ్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అదేవిధంగా రే పాకు గొ మ్ము. గ్రామ రెవెన్యూ అధికారి ఎస్ కే .షకీలా మాట్లాడుతూ ఆ గ్రామంలో రెండు వేల తొమ్మిది వందలు ఓట్లు ఉన్నాయని తెలిపారు. రేషన్ కార్డులు ఆరువందల ఎనభై ఐదు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలుకు సంబంధించి న పరిష్కారాలను పరిష్కరిస్తున్నట్లు తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Disciplined Education Teaching

You cannot copy content of this page

Scroll to Top