Yoga Andhra Program : ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 27/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈనెల ఇరవై ఒకటి వ తేదీ నుండి వచ్చేనెల జూన్ ఇరవై ఒకటి వ తేది వరకు ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామ పంచాయతీలోనూ నిర్వహిస్తున్నట్లు, జరుగుతున్నట్లు ఎంపీడీవో యం. సరళ కుమారి అన్నారు.
ఈ యోగాసనాల వల్ల ప్రతి వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. అనారోగ్య బారిన పడకుండా ఈ యోగాసనాలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. మండలానికి సంబంధించి ఎన్ని పంచాయితీలు ఉన్నాయో సంబంధిత అధికారులచే ఈ ఆసనాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అందరూ కూడా పంచాయితీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది మరియు కార్యాలయం సిబ్బంది. ఎ ఓ యస్.యన్.బి సత్యవతి, సీనియర్ అసిస్టెంట్ కె.వి.వి. రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ బి.

రామకృష్ణ, టైపిస్టు మరియు జూనియర్ అసిస్టెంట్ సిచ్. కళ్యాణి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ ఎటువంటి లోటుపాట్లు, లేకుండా రాకుండా సిబ్బంది చూసుకున్నారు. ప్రతి పంచాయతీలో లోటు పాట్లు ను అడిగి తెలుసుకున్నారు. ఎవరు అయితే పెండింగ్ లో ఉన్నాయో వాళ్లని వీలైనంత త్వరగా పెండింగ్ ఉన్న వాటిని పూర్తిచేయాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga Andhra program was

You cannot copy content of this page

Scroll to Top