Sunil Kumar met MLA Vegulla : ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలసిన ఈస్ట్రన్ డెల్టా ప్రోజెక్ట్ కమిటీ చైర్మన్ సునీల్ కుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట. ఈస్ట్రన్ డెల్టా ప్రోజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి లు గురువారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయం లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుష్పగుచ్చం అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం వారు తాపేశ్వరం, పసలపూడి లాకులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండపేట డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పడాల వెంకట సుబ్బారెడ్డి, రామచంద్రాపురం డిసి నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, ఏడిద నీటి సంఘం అధ్యక్షులు కొలుపోటి సత్యనారాయణ మూర్తి (అబ్బు), కాజులూరు డిసి చైతన్య, కొమరిపాలెం డిసి కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, ఆయా డిసి లు, డబ్ల్యూఎ ప్రెసిడెంట్లు, అధికారులు ఇరిగేషన్ ఇ.ఇ రామకృష్ణ, డి.ఇ రమేష్ బాబు, ఎ.ఇ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sunil Kumar met MLA Vegulla

You cannot copy content of this page

Scroll to Top