జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 16 at 4.56.23 PM

TRINETHRAM NEWS

AP News : టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ

విజయవాడ: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు పిరికిపంద చర్య అని అన్నారు..

అర్ధరాత్రి పార్కింగ్‌లో ఉన్న వాహనాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. నిన్న ప్రసాదంపాడులో జరిగిన విస్తృతస్థాయి సమావేశం విజయవంతం అయ్యిందని.. గన్నవరంలో టిడిపి గెలుపు తధ్యమన్నారు. ఇటువంటి దాడులతో తమ టిడిపి కార్యకర్తలు, నేతలు భయపడరు, బెదరరని స్పష్టం చేశారు.

దాడులను తిప్పికొడతామన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు..

You cannot copy content of this page