Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

TRINETHRAM NEWS

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ.

డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా A.T. కృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. రానున్న జనాభా లెక్కల్లో భాగంగా కులగణనను చేపట్టాలని రాజకీయ వ్యవహారాలపై కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది. సమగ్ర అభివృద్ధి కోసం లక్ష్యమైన విధానాలను రూపొందించేందుకు ఇది మార్గం వేస్తుంది.ఇంత గొప్ప, సమానత్వాన్ని నెలకొల్పే నిర్ణయానికి గాను మోదీ జీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

యావత్ దేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్తూ అన్ని వర్గాలకు ఫళాలను అందిస్తున్న మోడీ కి మరియు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎస్సీ ఎస్టీ బీసి లకు ఇప్పటికే అనేక రకాలైన ప్రయోజనాలు కలిగే విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పంపి బీసీల పట్ల కేంద్రం తన నిబద్ధతను చాటి చెప్పింది.

రాబోయే రోజుల్లో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Y.T. Krishna expressed happiness

You cannot copy content of this page

Scroll to Top