Trinethram News : ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి.
క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును పోలీసులు వెలికి తీశారు. కారులో వెనుక సీటులో ఏపీలోని కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్(50) మృతదేహం ఉండగా, డ్రైవర్ ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ పదేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశ సమయంలో పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో పేరుతో ఈయన రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


