ఆదివాసీ గిరిజన సంఘం పొద్దు బాలదేవ్
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 14: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు తీవ్రమైన ద్రోహం చేయడమేనని ఆదివాసుల హక్కులు,చట్టాలు జొలికిస్తే సహించేది లేదని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు జగన్నాథం మాట్లాడుతూ 1952 ముందు నుండి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నా 40% గిరిజనేతరులకు పక్కా గృహాలు నిర్మించుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి అడగడం 1/70 చట్టం ఉల్లంఘించడమే అవుతుందని 1/70 చట్టంపై శాసనసభ స్పీకర్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆదివాసులు తీవ్రస్థాయిలో తిరగబడ్డారని స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి 1/70 చట్టం రక్షణకై కట్టుబడి ఉన్నామని ప్రకటించడం నిజమేనా లేక ఆదివాసులకు నమ్మించి మోసం చేయడమా రాష్ట్ర అసెంబ్లీలో 1/70 చట్టం రక్షణకై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ ప్రజాప్రతినిధి అయివుండి ఆదివాసీ హక్కులు,
చట్టాలు నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడడం అంటే రాష్ట్ర ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రలో భాగమేనని ఎమెల్యే శిరీషాదేవి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆదివాసులు అనేక సమస్యలతో అగచాట్లకు గురవుతున్నారని జీఓ నెంబర్-3 చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిపికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు,వంతెనలు నిర్మించాలని త్రాగునీరు ఇవ్వాలని విద్య ,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించాలని అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసులు ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఆదివాసుల సమస్యలపై మాట్లాడకుండా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో అక్రమంగా నివసిస్తున్న గిరిజనేతరులకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి కోరడం 1/70 చట్టం, పెసా చట్టాన్ని ఉల్లంఘించడమేనని తక్షణమే రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆదివాసీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని. హరి, పరశురాం, సహదేవ్, మగ్గన్న, తదితరులు హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


