Women’s Federations : మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం

TRINETHRAM NEWS
Women's Federations

అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్.

Women’s Federations : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 22, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని సోమ్లా తండా,కామేపల్లిగ్రామాలలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల నుండి మంజూరైన 10.లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులతో కలిసి దేవరకొండ శాసన సభ్యులునేనావత్ బాలు నాయక్ శంఖు స్థాపన చేసారు. డిండి మండలంలోని ఎర్రారం, టీ. గౌరారం, ఖానాపూర్, పెద్ద తండా, చెరుకుపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. డిండి మండలంలోని టీ. గౌరారం, ఖానాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
టీ. గౌరారం గ్రామంలో హై స్కూల్ ప్రహారీ గోడ,ఆహార ధాన్య నిల్వ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం ఎన్ ఆర్ ఈ జి ఎస్ కింద మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో గ్రామ సమాఖ్య ( వీ ఓ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాల బలోపేతానికి ఈ వీ ఓ భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా నాణ్యతతో ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దశలవారీగా గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ,
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందించడం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇకపై కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం. విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక సరికొత్త అధ్యాయానికి నాంది.
“ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. ఆభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నాం అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్పపత్రమే ఈ బడ్జెట్‌. పేదవాడి కన్నీరు తుచిన నాడే నిజమైన అభివృద్ధి అన్న మహాత్మాగాంధీ మాటలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఒక సుందరమైన,సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ ఈ బడ్జెట్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top