TRINETHRAM NEWS

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఉచితం బోన్స్ డెన్సిటీ టెస్ట్,

జిజిహెచ్ లో 200 మందికి ఉచితంగా బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ప్లుస్ రక్త క్రియాటివ్ పరీక్షలు

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం : ప్రతి మహిళ ఎముకల పటుత్వ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా కలె క్టర్ పి.ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.

గురువారం స్థానిక ప్రభుత్వ బోధనా సామాన్య ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సి ఎస్ ఆర్ కార్యకలాపలలో భాగంగా ఉచిత బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ప్లుస్ రక్త క్రియా టివ్ పరీక్షల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జి జి హెచ్ లో ఉచితంగా 200 మంది మహిళలకు బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో ప్లుస్ క్రియాటివ్ రక్త పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా కిడ్నీ కి సంబంధించిన పరీక్షలు, ఎముకల పటుత్వానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు వారి ఇళ్లల్లో అధికంగా శ్రమ పడుతుంటారని , వారి కుటుంబం ఆరోగ్యం కోసం ఆలోచన చెయడం పై ఉన్న శ్రద్దా వారి ఆరోగ్య విషయంలో చూపరు అన్నది వాస్తవం అన్నారు.

కాబట్టి ఎముకలు బలహీనంగా ఉన్నాయో లేదో తెలుసు కోవడానికి ఎముకల పట్టుత్వ పరీక్షలు తప్పని సరిగా చేయించు కోవాలని కలక్టర్ కోరారు. ఎముక పగుళ్ల ప్రమాదాన్ని అంచనా వేయడానికి, ఎముకలకు నష్టం కలిగించే ఇతర వైద్య సంబంధ పరిస్థితు లను ముందస్తుగా గుర్తించడానికి ఈ పరీక్ష ల్లో ఉపయోగపడుతుందని తెలిపారు. 65 సంవ త్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, లేదా బోలు ఎముకల వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా ఎముకల పటుత్వనికి చెందిన ఇటువంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్ లక్ష్మీ సూర్య ప్రభ మాట్లాడుతూ, సన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎముకుల పటుత్వ, కిడ్నీ పరీక్షలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలోని వైద్యులకు,సిబ్బందికి, రోగులకు ఉచితంగా పరీక్షలను చేసినట్లు తెలిపారు. పరీక్ష నివేదిక ప్రకారం మందులు, ఇతర సూచనలు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. మహిళ లో శారీరక ఆరోగ్యం, వయస్సు రీత్యా ఎముకులు పటుత్వం కోల్పోవడం జరుగుతుందని, ముందుగా వాటిని గుర్తించి చికిత్స అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం ఈ, హాస్పిటల్ సూపరిం టెండెంట్, ఎం. లక్ష్మిసూర్యప్రభ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, హా స్పిటల్స్ డి. సి హెచ్, ఎన్.పీ పద్మశ్రీ రాణి, సన్ ఫార్మా కి సంబంధించిన మేనేజర్, ఏ ఆనంద్ బాబు, సన్ ఫార్మా మేనేజర్, వి. నాగ గణేష్, మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్, వి.దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Bone Density Test