CM Chandrababu : నేడు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

Trinethram News : సీఎం చంద్రబాబు సోమవారం అర్థరాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన వన్ జన్ పథ్‌కు వెళ్లి బస చేస్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

22వ తేదీ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై వారితో చర్చిస్తారు.

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖామంత్రి, న్యాయ శాఖా మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu to arrive

You cannot copy content of this page

Scroll to Top