జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 11.56.04

TRINETHRAM NEWS

చంద్రబాబు నిర్ణయంతో వైద్య విద్యకు దూరం కానున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు

ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తారా? కూటమి ప్రభుత్వం నిర్వాకంతో 2450 వందల ఎం బి బి ఎస్ సీట్లు నష్టం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారీ తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ

Trinethram News : సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాజమండ్రి, జనవరి 30: రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మాణం లో ఉన్నాయని ఆ కళాశాలలు మేము నిర్మించలేంమని కూటమి ప్రభుత్వం నేసనల్ మెడికల్ కమిషన్ లేక వ్రాసి 2025 విద్యా సంవత్సరం 700 వందల ఎం బి బి ఎస్ సీట్లు నష్టం కలిగించేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిoదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు

గురువారము ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు 2022 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నాయిని 2023లో ఆనాటి ప్రభుత్వం రూ .8480 కోట్లతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని 2023 సెప్టెంబర్ నాటికి విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో ప్రారంభించారు కానీ 2024 కి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆదోని మదనపల్లి మార్కాపురం పాడేరు పులివెందులలో ప్రారంభ కావాల్సిందిగా కావాల్సి ఉండగా పాడేరులో కేవలం 50 సీట్లుతో ప్రారంభించి మిగతా చోట్ల అక్కర్లేదని నేషనల్ మెడికల్ కమిషన్కు రాసేశారు
2025 26 విద్యాసంత్రానికి 7 ప్రభుత్వ వైద్య కళాశాలలో అమలాపురం బాపట్ల నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం పిడుగురాళ్లు పెనుగొండ లో ప్రారంభం కావాలని ఇవన్నీ నిర్మాణంలో దశల్లో ఉన్నాయిని ప్రారంభం కానీ 11 కాలేజీ లను మూసి వేయడానికి సేఫ్ క్లోజ్ కోసం జీవో నెంబర్ 27 జారీ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారని ఈ 11 కాలేజీలు ప్రారంభించకపోవడం వల్ల మన ఏపీ విద్యార్థులు 24 50 మెడికల్ సీట్లను కోల్పోయిందిని దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని మధు అన్నారు ఇకనుండి డబ్బు ఉన్న వాడు మాత్రమే కోటి రూపాయలు వెచ్చించి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ లో చేరుతారని దీంతో వైద్యం పూర్తిగా సామాన్యుడికి దూరం కానుంది ని అన్నారు

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అధికారo లోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వ వైద్య కళాశాలనే మూసివేసి ప్రయత్నం చేయడం దారుణం అన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ విద్య వైద్యం ను ప్రోత్సహించాలి అంతేగాని ప్రైవేటు పెట్టుబడిదారులకు వైద్య విద్యను ద్వారాలు తెరవడం దారుణమని మధు అన్నారు గత మూడు రోజులుగా సిపిఐ కార్యాలయానికి 30 మంది వరకు నీట్ రాసిన విద్యార్థులు వారి పేరెంట్స్ వచ్చి కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని చెపుతూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణాన్ని పూర్తిచేసి మెడికల్ సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని లేని ఎడల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారితో సంప్రదించి నీట్ విద్యార్థులు తల్లిదండ్రులతో భవిష్యత్తు ఆందోళన చేపడతామని మధు తెలిపారు

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సీపీఐ నగర కార్యదర్శి
వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page