జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 12.08.24

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఇలాఖాలో నీటి కటకట

సొంత గ్రామంలోనే ప్రజలు ఇక్కట్లు.. తాగునీరివ్వండి మహాప్రభో అంటూ వేడుకోలు.. నిలిచిన సత్య సాయిబాబా పథకం నీటి సరఫరా… మోటర్లు తక్షణమే రిపేర్లు చేయించి మంచినీటిని అందించాలి..

ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన గాదరాడలోని దుర్గానగర్,ఇందిరమ్మ కాలనీ గ్రామ మహిళలు..

Trinethram News : కోరుకొండ మండలం, గాదరాడ గ్రామం: వేసవికాలం రాకముందే గ్రామ ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. రాజానగరం నియోజక వర్గంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో దుర్గా నగర్,ఇందిరమ్మ కాలనీలో కొద్దికాలంగా త్రాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్న,తమ త్రాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టు కున్నా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని తమను పట్టించుకునే నాథుడే కరువ య్యాడని గాదరాడ గ్రామంలో దుర్గానగర్ ఇందిరమ్మ కాలనీలో మహిళలు రోడ్డు ఎక్కి తమ ఆవేదనను తెలియజేశారు.

మా గ్రామానికి చెందిన బత్తుల బలరామకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాదరాడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని భావించామని,కనీసం తాగు నీటిని అందించే పరిస్థితి కూడా లేదని వారు వాపోయారు..

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మరియు నీటి సరఫరా మంత్రిగా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజక వర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నని ప్రజలు పెదవి వీరుస్తున్నారు.

ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి గాదరాడ గ్రామంలోని సత్య సాయి పథకంలో మోటర్లకు తక్షణమే రిపేర్లు చేయించాలని, దుర్గమ్మ గుడి దగ్గర ఉన్న హ్యాండ్ బోర్ ను కూడా మరమ్మత్తులు వెంటనే చేయించి గాదరాడ గ్రామంలోని దుర్గానగర్, ఇందిరమ్మ కాలనిలో మంచి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో రోడ్డెక్కి నిరసన గళం తెలియజేస్తామని మహిళలు తెలియజేశారు.

కాలనీలో వారంతా బతుకుదెరువు కోసం బయట ప్రాంతానికి వెళ్లి ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తామో మాకే తెలియదని,బిందెడు మంచినీటి కోసం అల్లాడి పోతున్నామని ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన,ముందు గా తక్షణమే అధికారులకు చెప్పి మంచినీరు మా కాలానికి వచ్చేటట్లు చెయ్యండి సారూ..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page