ANDHRAPRADESH

Wife Stabs Husband : టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ – మంగళగిరి మండలం: పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.

పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తున్నారు.

క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.

గురువారం రాత్రి ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ను పొడిచినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wife stabs husband to death

You cannot copy content of this page