అనంతగిరి,డిసెంబర్ 2 (త్రినేత్రం న్యూస్): ఎగువశోభ పంచాయితీ దిగువశోభ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొర్ర సీతన్న ,సొరు బుడ్డి కుటుంబంలో జరిగిన దుర్ఘటన అనంతరం, కూటమి నాయకులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఇటీవల సీతన్న మృతి చెందడంతో, నెల నెల వచ్చే పెన్షన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. భార్య సొరు బుడ్డి సహాయం, ఆదరణ లేక ఒంటరైపోయిన నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న స్థానిక కూటమి నాయకులు వెంటనే స్పందించారు.
గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టం శ్యామ్ మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆధ్వర్యంలో, సర్పంచ్ కొర్ర సింహద్రి అధ్యక్షతన అధికారులు సంప్రదించి, మరణించిన సీతన్న భార్యకు తక్షణమే వితంతువు పెన్షన్ మంజూరు చేయించారు. ఈరోజు సొరుబుడ్డికి పెన్షన్ పంపిణీ చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ దారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నెలసరి పెన్షన్లను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి పేర్కొన్నారు. మండల పరిధిలో పెన్షన్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే స్వయంగా తమ దృష్టికి తీసుకురమ్మని, అర్హతలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాల ప్రయోజనాలు పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి జి. రమేష్, నాయకులు బుద్దు, ప్రదీప్, అప్పారావు, ప్రవీణ్, కొర్ర గాసి, వార్డు సభ్యుడు చిన్నయ్య, పొట్టంగి రాజు, బాలరాజు, చిరంజీవి, సింహద్రి, జనసేన నాయకులు బుజ్జిబాబు, మోహన్, సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రమౌళి, అగ్రికల్చర్ అసిస్టెంట్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


